ముంపు పరిస్థితులు తలెత్తకుండా చర్యలు

బనశంకరి: నగరంలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడా ముంపు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు సత్వరం తొలగించాలని పాలికె అధికారులకు బీబీఎంపీ కమిషనర్ తుషార్‌గిరినాథ్ సూచించారు నగరంలోని రాజాజీనగర, బొమ్మనహళ్లి ముంపుప్రాంతాలైన అరికెరె, అనుగ్రహలేఔట్ ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అనుగ్రహ అపార్టుమెంట్ వద్ద రాజకాలువ నీరు పొంగిపొర్లుతుండటాన్ని పరిశీలించి, తక్షణం పూడిక తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో 225 చెట్ల్లు, 1050 చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయని కమిషనర్ తెలిపారు. వాటిని ఇప్పటికే తొలగించామన్నారు. ఆయన వెంట బొమ్మనహళ్లి వలయ కమిషనర్ హరీశ్‌కుమార్, బసవరాజ్ కబాడే, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.