భళా.. కస్తూరిబా | - | Sakshi
Sakshi News home page

భళా.. కస్తూరిబా

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

ఆశల సాగు.. కూల్‌.. కూల్‌

బాలికల భవిష్యత్‌కు కేజీబీవీలే భరోసా

యంగ్‌ ఇండియా ఎక్స్‌లెన్స్‌లుగా మూడు పాఠశాలలు

ఈ ఏడాది జిల్లాలో 4,160 సీట్లకు.. 3,217 భర్తీ

ఆశల సాగు..
కూల్‌.. కూల్‌

ఎల్‌నినో ప్రభావంతో సాగురంగం ప్రశ్నార్థకంగా మారగా.. రెండు రోజులుగా కురుస్తున్న వాన అన్నదాతల్లో ఆశలు రేపుతోంది. చిరుజల్లులతో ఆరుతడి పంటలకు జీవం పోసినట్లు కాగా.. రైతులు దౌర తోలుతున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు ప్రాణం పోసినట్లు కాగా.. జిల్లావ్యాప్తంగా పంటలకు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. సోమవారం నుంచి చినుకులు కురుస్తుండడంతో పత్తిలో కలుపు తీస్తూ తలో పనిలో నిమగ్నమయ్యారు. వరినాటుకు సిద్ధం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

కరీంనగర్‌టౌన్‌: బాలికలకు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీలు) ఆశాకిరణంగా నిలుస్తున్నాయి. ఉచిత వసతి, పోషకాహారం, నాణ్యమైన విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తూ బాలికల భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. జిల్లాలోని కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి జూన్‌ 1 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 4,160 సీట్లకు 3,217 మంది బాలికలు ప్రవేశాలు పొందారు.

యంగ్‌ ఇండియా ఎక్స్‌లెన్స్‌లుగా మూడు స్కూళ్లు ఎంపిక

జిల్లాలోని కరీంనగర్‌, రామడుగు, శంకరపట్నం, కస్తూర్బా విద్యాలయాలను యంగ్‌ ఇండియా ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. వీటిలో నీట్‌, ఐఐటీ జేఈఈ, క్లాట్‌ ప్రవేశ పరీక్షలకు తర్ఫీదు ఇవ్వనున్నారు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సాధారణ ఇంటర్‌తో పాటు ఎంపిక చేసుకున్న కోర్సుపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

జిల్లాలో ఇలా

జిల్లాలోని 16 మండలాలకు గాను 14 మండలాల్లో కేజీబీవీలు ఉన్నాయి. 10 కేజీబీవీ కళాశాలున్నాయి. 6వ తరగతిలో 40, ఇంటర్‌లో ప్రథమ సంవత్సరంలో గ్రూప్‌నకు 40 సీట్ల చొప్పున ఉంటాయి. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీ అయిన సీట్లను భర్తీ చేస్తుంటారు. ప్రతి కేజీబీవీకి విశాలమైన సొంత భవనాలు, డిజిటల్‌ తరగతి గదులు, క్రీడా మైదానాలు ఉన్నాయి. హాస్టల్‌ వసతి, నోట్‌, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. భోదన, బోధనేతర సిబ్బంది మహిళలే ఉంటారు. కంప్యూటర్‌ విద్యతో పాటు, యోగా, క్రీడాలు, కరాటే నేర్పిస్తారు. నైట్‌ మహిళా వాచ్‌మెన్‌తోపాటు ఇద్దరు టీచర్లు రాత్రి నిధులు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఏఏన్‌ఎంలు వచ్చి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తారు.

పాఠశాల చదువుకు భిన్నంగా

కస్తూరిబాల్లో చదువు పాఠశాలలకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చదివే వారికి వసతి సహా మూడు పూటలా పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా ఏకరూప దుస్తులు, కాస్మోటిక్‌ కిట్లు, దుప్పట్లు అందజేస్తారు. వేసవిలో కరాటే శిక్షణతో పాటు, ఆంగ్ల భాష నేర్చుకోవడం, బృంద చర్చలు, నృత్యాలు, చిత్రలేఖనం వంటి వాటిపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

కొద్దిరోజులుగా ఉక్కపోతతో అల్లాడిన నగరం చల్లబడింది. వర్షాకాలం ప్రారంభమైన నెలరోజుల తరువాత వరుణుడు కరుణించగా.. రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో నగరం తడిసి ముద్దయింది. కూల్‌కూల్‌ వెదర్‌ను నగర ప్రజలు ఆస్వాదిస్తుండగా.. చిరుజల్లుల్లో గొడుగులు, రెయిన్‌కోట్లు వేసుకుని తమ పనుల్లో నిమగ్నమయ్యారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement