ప్రజా భద్రతే పోలీసుల లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా భద్రతే పోలీసుల లక్ష్యం

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

భూ రీ–సర్వేపై అవగాహన ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

ఇల్లందకుంట: ప్రజా భద్రతే పోలీసుల లక్ష్యమ ని సీపీ గౌస్‌ ఆలం పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఇల్లందకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొ క్కలు నాటారు. పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు ముద్రించిన పరీక్ష ప్యాడ్లు, ద్విచక్రవాహనదా రులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. పోలీస్‌స్టేష న్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఏసీపీ మాధవి, సీఐలు శ్రీనివాస్‌, వెంకట్‌, ఎస్సై ఎం.క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

ఇల్లందకుంట: భూ భారతి రీ–సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు రైతులు సహకరించాలని అడిషనల్‌ కలెక్టర్‌ ఽశ్రీనివాస్‌రెడ్డి పిలు పునిచ్చారు. మండలంలోని పాతర్లపల్లిలో మంగళవారం భూ భారతి రీ–సర్వేపై గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రీ– సర్వే ద్వారా భూముల సరిహద్దులు శాసీ్త్రయ పద్ధతిలో నిర్ధారించబడుతాయన్నారు. రైతులు తమ వద్ద ఉన్న పట్టాదారు పాస్‌బుక్కులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సర్వేకు సంబంధించి సందేహా లు, అభ్యంతరాలుంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఆర్డీవో జ్వాల కుమారి, తహసీల్దార్‌ పి.మనోజ్‌కుమార్‌, సర్పంచ్‌ బైరెడ్డి రమాణారెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్‌టౌన్‌: గురుకుల విద్యాసంస్థల ఉద్యోగులకు ఎంప్లాయీస్‌ హెల్త్‌స్కీం అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ మైనా రిటీ గురుకుల ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ గురుకుల ఉద్యోగుల సంఘం నాయకులు మాలోతు శ్రీనివాస్‌, పూర్ణచందర్‌, సతీశ్‌, శశిధర్‌, ఉపేందర్‌ పాల్గొన్నారు.

‘సర్‌’పై బీజేపీ సమీక్ష

కరీంనగర్‌: నగరంలోని 40 డివిజన్లలో ఓటరు జాబితా ప్రక్షాళన, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌ ) కార్యక్రమంపై బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్‌ కోలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్క యువతీ యువకుడికి ఓటు హక్కు కల్పించే దిశగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటూ కీలకమేనని, 40 డివిజన్లలో చేపట్టిన ఈ ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగడం సంతోషకరమైన పరిణామమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement