ఇచ్చిన మాట నెరవేర్చిన సోనియాగాంధీ | - | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నెరవేర్చిన సోనియాగాంధీ

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

పోలీసు కమిషనరేట్‌లో..

కరీంనగర్‌ కార్పొరేషన్‌: తెలంగాణ ప్రజల ఆకా ంక్షను గుర్తించి, కరీంనగర్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక రాష్ట్ర కలను సోనియాగాంధీ నిజం చేశారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్‌ సత్తు మల్లేశం, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో..

కరీంనగర్‌క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో ఏసీబీ న్యాయమూర్తి, ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నామ సంతోష్‌ కుమార్‌ జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.కుమార్‌ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మర్చిపోలేనిదని అన్నారు. అదనపు జిల్లా జడ్జి నీరజ, మేజిస్ట్రేట్లు సిబ్బంది పాల్గొన్నారు.

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సీపీ గౌస్‌ ఆలం జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. పరిపాలన కార్యాలయం వద్ద అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) వెంకటరమణ జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement