కరీంనగర్ అర్బన్: విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్‌పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇన్‌పుట్ డీలర్లకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లొమా కోర్సు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ఎక్కువగా డీలర్లని నమ్ముతారని, అందువల్ల డీలర్లకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకుగాను ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు విక్రయించాలని, వాతావరణ అంచనాలను పరిస్థితులను వివరించాలని తెలిపారు. అనంతరం 36మందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ పీడీ చత్రునాయక్ తదితరులుల పాల్గొన్నారు.
ఖేత్ బచావో అభియాన్ ప్రారంభం
ఖేత్ బచావో అభియాన్ పోస్టర్‌ను కలెక్టర్ చిత్రామిశ్రా ఆవిష్కరించారు. ఈ నెల1 నుండి 30 వరకు వ్యవసాయ శాఖ అధికారులు నేల ఆరోగ్య పరిరక్షణ కాంపెయిన్‌ను నిర్వహించనున్నారు.
4 నుంచి గ్రామ, వార్డు సభలు
ఈ నెల 4నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. 4, 6, 8, 10వ తేదీల్లో సభలను నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.


