పరేడ్ గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకల్లో జెండావిష్కరణ అనంరతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు, సుడా, గ్రంఽథాలయ చైర్మన్లు, అధికారులతో కలిసి మంత్రి అమరవీరులస్తూపం వద్దకు వెళ్లారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ గౌస్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న పాల్గొన్నారు.


