గన్నేరువరం(మానకొండూర్): బీజేపీ ఎంచుకున్న సిద్ధాంతం, భావజాలంతోనే ఈ స్థాయికి వచ్చిందని, ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కల్గిన పార్టీగా అవతరించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం గుండ్లపల్లి స్టేజీలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన బీజేపీ నేడు దేశాన్ని ఎలుతోందని, వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి దేశంలో తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. బీజేపీ అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని, పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ ఆకాంక్షించినట్లు పేదలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో మోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశ ప్రజలాంత బీజేపీపై ఎనలేని విశ్వాసంతో ఉన్నారని, అందుకే మూడుసార్లు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాడానికి కృషి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు వినుగొండ నాగేశ్వర్‌రెడ్డి, కరివేద మహిపాల్‌రెడ్డి, పుల్లెల పవన్, సర్పంచులు సొల్లు అజయ్‌వర్మ, రాజిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, సా యికృష్ణ, జగన్, పిస్క కిట్టు, రాము, సోమరాజురెడ్డి, రామచంద్రం, మహేందర్, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్


