ఆరోగ్యం.. ఆనందం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం.. ఆనందం

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

ఎన్‌సీడీ సమాచారం

కరీంనగర్‌: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా లేకుంటే కొట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్లే. ప్రస్తుత జీవనశైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాటపడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది.

దీర్ఘకాలిక వ్యాధులపై దృష్టి

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు కొంతకాలంగా ఎన్‌సీడీ (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌) పేరుతో స్క్రీనింగ్‌ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌తో పాటు పలు రకాల క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

2 లక్షల మందికి స్క్రీనింగ్‌

జిల్లాలో 10.5 లక్షల జనాభా ఉండగా, ఎన్‌సీడీ ప్రో గ్రాం కింద 5.2 లక్షల పరీక్షలు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 2 లక్షల పైచిలుకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ బాధితులు ఉన్నట్లు గుర్తించి అందరికీ వైద్యం అందిస్తున్నారు.

ఆరోగ్యం కోసం జాగ్రత్తలు

– 6 నెలలకు ఒకసారి హెల్త్‌ చెక్‌అప్‌ తప్పనిసరి. సిగరేట్‌, మద్యపానం, గుట్కా, గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.

– నిత్యం వ్యాయామం, అరగంటపాటు వాకింగ్‌ చేయాలి. జంక్‌ఫుడ్‌, హోటల్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.

– వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్‌, హార్ట్‌ సమస్యలకు చికిత్స తీసుకోవాలి. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ ఉంటే మరింత జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

జిల్లాలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు

35 నుంచి 50 ఏళ్ల లోపు వారే అధికం

ఎన్‌సీడీ ప్రోగ్రాంతో బయటపడుతున్న రోగులు

జీవన విధానం, ఆహారంలో మార్పులే కారణం

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

జిల్లాలో..

బీపీ బాధితులు : 68 వేలు

షుగర్‌ బాధితులు : 39 వేలు

చేసిన పరీక్షలు : 2 లక్షలు

పరీక్షల లక్ష్యం : 5.2 లక్షలు

–––––––––––––––

కేన్సర్‌ కేసులు

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ : 60

ఓరల్‌ క్యాన్సర్‌ : 10

సర్వైకల్‌ క్యాన్సర్‌ : 20

ఇతర క్యాన్సర్‌ కేసులు : 08

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement