అతివేగం.. అదుపుతప్పిన కారు | - | Sakshi
Sakshi News home page

అతివేగం.. అదుపుతప్పిన కారు

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

గోదావరిఖని: అతి వేగం.. లిప్తపాటులో జరిగిన ప్రమాదంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం అర్ధరాత్రి ఘటన జరిగింది. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వేడుకకు హాజరై చౌరస్తా నుంచి మున్సిపల్‌ కార్యాలయం వైపు నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్‌ టాకీష్‌ సమీపంలో కారు అదుపుతప్పింది. ఎడమవైపు ఉన్న ఓ షాపుతోపాటు, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో జీడీకే–11గనిలో అసిస్టెంట్‌చైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఏల్పుల శ్రీధర్‌(39) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో లక్ష్మణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరినీ స్థానిక సింగరేణి ఏరియా లాస్పత్రికి తరలించిచారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌ రెఫర్‌ చేశారు. ఈసంఘటనలో జీడీకే–1వగనిలో జనరల్‌అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తడకల మహేందర్‌, నామిని లక్ష్మణ్‌, మాలోతు శ్రీకాంత్‌ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ రమేశ్‌ కేసు నమోదు చేసుకున్నారు. ఏల్పుల శ్రీధర్‌ మార్కండేయకాలనీలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

రోడ్డు పక్కన విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

సింగరేణి కార్మికుడు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement