ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు తాళలేని ఓ ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ టో నడవక సరైన ఉపాధి లేక కటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేసిన ఆటోడ్రైవర్ తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండ ల కేంద్రానికి చెందిన మారెల్లి శ్రీనివాస్(52) అద్దె ఇంట్లో ఉరివేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. కొన్నెళ్లుగా ఆటో నడుపుతున్న శ్రీనివాస్ ఏడాది క్రితమే కూతురు వివాహనికి అప్పులు చేశాడు. ఆటోకు సరైన గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అప్పులు తీరేమార్గం కనిపించక, ఆటో నడిపిన సరైన గిరాకీలు లేవని తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మృతితో భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతున్న శ్రీనివాస్ చివరికి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


