ఇల్లందకుంట: అపరభద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ముఖ్య ఘట్టం చంద్రరథోత్సవం(పెద్దరథం) శుక్రవారం రాత్రి 11 గంటలకు వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ప్రధానార్చకుడు శేషం వంశీధరచార్యులు, రవికుమార్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, పెద్దరథంపై ఆసీనులు గావించారు. అనంతరం ఆలయ మాడవీధులో ఊరేగించారు. శనివారం సాయంత్రం వరకు స్వామివారు పెద్దరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ఇన్‌చార్జి ఈవో కె.సుధాకర్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.


