మంత్రి లక్ష్మణ్‌ చెప్పినా.. | - | Sakshi
Sakshi News home page

మంత్రి లక్ష్మణ్‌ చెప్పినా..

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

మంత్రి లక్ష్మణ్‌ చెప్పినా.. అర్బన్‌ నక్సల్స్‌ లేరు

గతేడాది వర్సిటీలో ఎస్సీ సంక్షేమ నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనుల ప్రారంభ సమయంలో మంత్రి లక్ష్మణ్‌కు ప్రాధాన్యం తగ్గించి న విషయం అప్పట్లో వివాదాస్పదమైంది. ఇది ఇద్దరు రాష్ట్ర మంత్రుల మధ్య మాటల చిచ్చు పెట్టింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఆ సమయంలో వీసీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తన శాఖ నిధులతో జరిగే పనులలో తనకు ప్రాధాన్యం తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ విషయంలో పొరపాట్లు పునరావృతం కాకూడదని మందలించారు. తాజాగా తనను వరుసగా పదవుల నుంచి తప్పించడంపైనా ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మంత్రి లక్ష్మణ్‌ ఫోన్‌లో వీసీకి హిత వు పలికారు. సాక్షాత్తూ ఎస్సీ సంక్షేమ మంత్రి చెప్పినా వీసీ తనను వేధించడం ఆపడం లేదంటూ, అందుకే, అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించానని సుజాత ‘సాక్షి’కి వెల్లడించారు.

కరీంనగర్‌లో అర్బన్‌ నక్సల్స్‌ ఉన్నారంటూ మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై మా నిఘా విభాగాలు ఎలాంటి ఇన్‌పుట్స్‌ ఇవ్వలేదు. దీనిపై విద్యార్థులు ఎలాటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమిషనరేట్‌ పరిధిలో అర్బన్‌ నక్సలైట్లు ఎవరూ లేరు.

– గౌస్‌ ఆలం, పోలీస్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement