చొప్పదండి: పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సంబోజి శేఖర్ (48) శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందాడు. వేకువజామున మూడు గంటలకు గుండెపోటుకు గురవగా కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా, ఉదయం ఆరు గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అన్నకు కూడా గుండెపోటే..
శేఖర్ సోదరుడు సంబోజి విజయ్ కూడా గతంలో గుండెపోటుతో మృతి చెందాడు. 90వ దశకంలో పాత్రికేయ వృత్తిలో పని చేసిన విజయ్ అనంతరం న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ 2002లో గుండెపోటుకు గురై మృతి చెందాడు. అన్నదమ్ములిద్దరు గుండెపోటుకు గురై మృతి చెందడంతో వృద్ధ తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌లో శేఖర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, పాత్రికేయులు, పాఠశాలల ఉపాధ్యాయులు, కరస్పాండెంట్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


