జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని కొత్తబస్టాండ్‌లో సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడిచేశాడు. వరంగల్ పట్టణం పెర్కవాడకు చెందిన మహ్మద్ జలీల్ ఆర్టీసీ డ్రైవర్ శుక్రవారం విధుల్లో భాగంగా వరంగల్ డిపో నుంచి నిజామాబాద్‌కు బస్సు తీసుకుని వెళ్తుండగా జగిత్యాలలో ఆటో నడుపుతున్న ముస్కు ప్రదీప్ బస్సు వెనుక నుంచి హారన్ కొట్టగా సైడ్ ఇవ్వలేదు. దీంతో ప్రదీప్ ఆగ్రహం చెందుతూ బస్సును వెంబడించి కొత్తబస్టాండ్‌లోకి వచ్చిన తర్వాత బస్సు డ్రైవర్ మహ్మద్ జలీల్‌ను దుర్భాషలాడుతూ దాడిచేశాడు. దీంతో అతడి ముఖానికి బలమైన గాయాలవడంతో అధికారులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ముస్కు ప్రదీప్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.


