కరీంనగర్‌టౌన్: ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం కరీంనగర్–2వ డివో ఎదుట ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వినీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్లను పునరుద్ధరించాలని అవుట్‌సోర్సింగ్ నియామకాలు రద్దు చేయాలన్నారు. రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. యూనియన్ నాయకులు సమ్మయ్య, ఎంపీ రెడ్డి, సంపత్ రెడ్డి, శంకర్, పుల్లయ్య ఉన్నారు.


