కరీంనగర్: బాలికల ఆరోగ్య రక్షణకు భరోసా కల్పించేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డీఎంహెచ్‌వో వెంకటరమణ పేర్కొన్నారు. నగరంలోని మోతాజ్‌ఖానా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ నిర్వహించబడుతుందని తెలిపారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు, సందేహాలు ఉన్నా, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి సరైన సమాచారం పొందవచ్చని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా సూచించారు. పీవోఎంహెచ్‌ఎన్ సనా జవేరియా, వైద్యాధికారి ఇమ్రాన్‌ఖాన్ పాల్గొన్నారు.
పుకార్లు నమ్మొద్దు
కరీంనగర్ అర్బన్: వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరఫరా సాధారణంగానే ఉందని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, అధికారిక మార్గాల్లో గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. భారత్ గ్యాస్ 1800224344, ఇండెన్ గ్యాస్ 7588888824, హెచ్‌పీ గ్యాస్ 9222201122 వాట్సాప్ నంబర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.


