ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

● గణేశ్‌ బెంగళూరు బేకరీ లైసెన్స్‌ తాత్కాలిక రద్దు

కరీంనగర్‌రూరల్‌: రాంగ్‌రూట్‌లో వస్తున్న ద్విచక్రవాహనదారుడు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు దుర్శేడ్‌కు చెందిన మేడ హన్మాండ్లు(63) గోపాల్‌పూర్‌లోని వైన్స్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9.30గంటలకు పని ముగించుకుని సైకిల్‌పై దుర్శేడ్‌కు వెళ్తుండగా రాంగ్‌రూట్‌లో వచ్చిన ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టగా రోడ్డుపై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన హన్మాండ్లును అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ద్విచక్రవాహనదారుడిని చత్తీస్‌ఘడ్‌ గడ్చిరోల్‌కు చెందిన విలాస్‌బీమయ్యగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని త్వరలో పట్టుకుని చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

నాణ్యతలోపంపై ఫుడ్‌సేఫ్టీ కొరడా

కరీంనగర్‌ అర్బన్‌: కుళ్లిన గుడ్లు.. ఎగ్‌పఫ్‌ల నుంచి దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ నిర్వహణపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు కొ రడా ఝుళిపించారు. నగరంలోని రేకుర్తిలోని గణేశ్‌ బెంగళూరు బేకరీలో తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లోపాలను గుర్తించి లైసెన్స్‌ను తాత్కలికంగా రద్దు చేశారు. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన షుగర్‌ సిరప్‌, క్రీమ్‌లో పురుగులు, నిల్వ ప్రాంతంలో 14 ట్రేలు పగిలిన గుడ్లు ఉన్నట్లు గుర్తించగా పగిలిన గుడ్లతో తయారు చేసిన సుమారు రూ.7వేల విలువైన కేకులు బేకరీలో ఉన్నట్లు గుర్తించామని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వివరించారు. పాడైన గుడ్లు, కేకులను అక్కడికక్కడే తొలగించి పారవేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించే వరకు బేకరీ నిర్వహణకు అనుమతి లేదని వివరించారు.

రగ్బీ రన్నరప్‌ కరీంనగర్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: తెలంగాణ అండర్‌–12 మినీ సబ్‌ జూనియర్‌ ఇంటర్‌స్కూల్‌ రగ్బీ టోర్నమెంట్‌లో కరీంనగర్‌ జిల్లా రన్నరప్‌ సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాజట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. జట్టు క్రీడాకారులను జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, ఒలింపిక్‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్‌, గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, జిల్లా రగ్బీ సంఘం కార్యదర్శి శివకృష్ణ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement