కొండగట్టుకు శునకం పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

కొండగట్టుకు శునకం పాదయాత్ర

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

వారు ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన హనుమాన్‌ దీక్షాపరులు. మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు బయలుదేరారు. దారిలో ఓ శునకం ఎదురుపడగా దానికి ఓ బిస్కట్‌ ఇచ్చారు. దీంతో ఆ శునకం దీక్షాపరులతో పాటు కొండగట్టు వరకు పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేస్తున్న శునకానికి కాళ్లనొప్పులు రావడంతో సాక్స్‌లు సైతం తొడిగారు. ఐదురోజులుగా పాదయాత్ర చేస్తుందని, వెళ్లగొట్టినా పోవడం లేదని, సుమారు 130 కి.మీ దూరం తమతో నడిచి వచ్చిందని దీక్షాపరులు తెలిపారు. శుక్రవారం కొండగట్టుకు చేరుకున్నామని పేర్కొన్నారు. – జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement