రిమాండ్‌ అవసరం లేదు.. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వండి..! | Karimnagar Court Rejects Plea to Remand RBL Bank Scam Suspects | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ అవసరం లేదు.. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వండి..!

Mar 28 2026 7:53 PM | Updated on Mar 28 2026 8:09 PM

Karimnagar Court Rejects Plea to Remand RBL Bank Scam Suspects

కరీంనగర్‌: ఆర్బీఎల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న 13 మందిని రిమాండ్‌కు ఇవ్వాలన్న అభ్యర్ధనను కరీంనగర్‌ కోర్టు తిరస్కరించింది. వారిని రిమాండ్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని సీపీకి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు లేకుండా అక్రమాలు జరిగాయని ఎలా నిర్దారిస్తారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. 

స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని సీపీకి సూచించింది. దాంతో ఈ కేసులో అరెస్టైన 13 మందికి స్టేషన్‌ బెయిల్‌ లభించింది. సొంత పూచీకత్తుపై 13 మందికి బెయిల్‌ మంజూరు చేశారు.

కాగా, కరీంనగర్‌ ఆర్బీఎల్ బ్యాంకులో నిన్న(శుక్రవారం, మార్చి 27వ తేదీ) భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 130 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. నకిలీ ఖాతాలు తెరిచి, మ్యూల్‌ ఖాతాలో డబ్బులు మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది.  సైబర్‌ క్రైమ్‌​, హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

ఈ కుంభకోణం ఘటనకు సంబంధించి 13 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఆర్బీఎల్‌ కిసాన్‌ నగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌తో పాటు ఇతర ఉద్యోగులు, కొందరు మధ్యవర్తులు ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement