గురి తప్పని బాణం | - | Sakshi
Sakshi News home page

గురి తప్పని బాణం

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

గురి తప్పని బాణం ● ఆసియా కప్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో స్వర్ణం, రజతం సాధించిన చికిత

కరీంనగర్‌స్పోర్ట్స్‌/ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన యువ ఆర్చర్‌ తానిపర్తి చికిత శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ టోర్నీ స్టేజ్‌–1లో బంగారు, రజత పతకాలు సాధించింది. మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌, మహిళల టీమ్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ అందుకుంది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో రజత్‌ చౌహాన్‌, తానిపర్తి చికిత జోడీ 158–156 పాయింట్ల తేడాతో మలేషియాపై విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. కాంపౌండ్‌ మహిళల టీం విభాగంలో తానిపర్తి చికిత, రాజ్‌ కౌర్‌, తేజల్‌ సాల్వేలతో కూడిన జట్టు ఫైనల్‌లో కజకిస్థాన్‌పై 227–229 తేడాతో తలపడి రజత పతకాన్ని సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement