ఐస్‌క్రీం వాహనాలకు నో ఎంట్రీ | - | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీం వాహనాలకు నో ఎంట్రీ

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

ఐస్‌క్రీం వాహనాలకు నో ఎంట్రీ కథలాపూర్‌(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం ఇప్పపెల్లి గ్రామంలోకి ఐస్‌ క్రీం బైక్‌లు, ఆటోలకు నో ఎంట్రీ అంటూ శుక్రవారం పంచాయతీ పాలకవర్గం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాణ్యతలేని ఐస్‌ క్రీంలు తినడంతో చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతారన్నారు. దీంతో గ్రామంలోని పలు వాడల్లో ఫ్లెకీలు ఏర్పాటు చేశారు. వాహనాలపై వచ్చి గ్రామంలో ఐస్‌క్రీంలు అమ్మితే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని సర్పంచ్‌ సంబ నవీన్‌ పేర్కొన్నారు.

స్వగ్రామానికి వలసజీవి మృతదేహం

కోరుట్లరూరల్‌: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌పెల్లి గ్రామానికి చెందిన కొండ్ర రాజేశ్‌ (36) 20 రోజుల క్రితం దుబాయ్‌లో మృతిచెందగా శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజేశ్‌ పదేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లి వస్తున్నాడు. ఇక్కడే సోరియాసిస్‌ వ్యాధి సోకింది. వ్యాధి నివారణ కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు 3 నెలల క్రితం మళ్లీ దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ వ్యాధి మరింత వ్యాప్తి చెంది శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించగా దుబాయ్‌లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువై 20 రోజుల క్రితం మృతిచెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement