కాశీకి వెళ్తూ... అనంత లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

కాశీకి వెళ్తూ... అనంత లోకాలకు..

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

స్వామి వారి లడ్డూకు రూ.70వేలు

మానకొండూర్‌: తన తల్లి అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు మానకొండూర్‌కు చెందిన రామోజు శ్రీనివాస్‌(55) కుటుంబ సభ్యులతో కలిసి రైలులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో గురువారం రాత్రి మృతిచెందాడు. శ్రీనివాస్‌ కుల వృతి(గోల్డ్‌ వర్క్‌) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన తల్లి మణెమ్మె 3 నెలల క్రితం చనిపోగా.. ఆమె అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు గురువారం ఉదయం రైలులో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బయలు దేరారు. మార్గమధ్యలో మహారాష్ట్ర సేవాగ్రామ్‌ వద్ద శ్రీనివాస్‌ తాగునీరు కోసం గురువారం రాత్రి రైలు దిగాడు. అదే సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొనడంతో శ్రీనివాస్‌ ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.

అంజన్న మాలధారుల ఫోన్లు చోరీ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లోని పెద్దమ్మ ఆలయంలో నిద్రిస్తున్న హనుమాన్‌ మాలధారుల 9 ఫోన్లు, రూ.9వేల నగదు గురువారం రాత్రి చోరీకి గురయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు. గ్రామంలోని పెద్ద మ్మ ఆలయంలో 12 మంది హనుమాన్‌ మాలధారులు నిద్రిస్తుండగా 9 మంది ఫోన్లు పోయినట్లు తెలిసింది. సెల్‌ఫోన్లు దొంగలించిన వ్యక్తి 12 మంది స్వాములలో ఒకరికి ఫోన్‌చేస్తూ బెజ్జంకిలో ఫలానా చోట మీ సెల్‌ఫోన్లు ఉన్నా యి తీసుకెళ్లండని ఫోన్‌చేయగా వెళ్లి 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మిగతా 5 ఫోన్లు అడిగితే రూ.20వేలు తన దగ్గర ఉన్న 5 ఫోన్లలో ఒకదానికి పంపించాలని దాని పిన్‌నంబర్‌ కూడా చెప్పాలని కండీషన్‌ పెడుతున్నాడు. ఈ విషయంపై ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్‌ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేశారని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారా యణపూర్‌లోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దత్తత శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారి లడ్డూకు రూ.70వేల వేళం పాటపాడా రు. ఈ లడ్డూను గ్రామానికి చెందిన వంగల లింగారెడ్డి–శోభ దంపతులు దక్కించుకున్నారు. బచ్చు మోహన్‌ రూ.40వేలతో స్వామి వారి వ్రతానికి మెట్లు చేయించారు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రి వైద్యుడు సత్యనారాయణస్వామి రూ.50వేలతో అన్నదానం చేశారు. సర్పంచ్‌ దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్‌ మోతె మధుసూదన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సాబేరబేగం, వైస్‌చైర్మన్‌ గుండాడి రామ్‌రెడ్డి, డీటీ ఎలుసాని ప్రవీణ్‌కుమార్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మోతె లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement