శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం వాగులో మత్స్యకారుని వలలో ఓ రాకాసి చేప చిక్కింది. కేశవపట్నం వాగులో శుక్రవారం మత్స్యకారులు చేపలు పట్టారు. తాడవేని సమ్మయ్య వాగులో వల వేయగా వింత ఆకారంలో ఓ చేప చేపడింది. వలలోంచి బయటకు తీసి ఇది డెవిల్ ఫిష్‌గా గుర్తించారు. జలాశయాల్లోని చేపలను ఆది ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు.
సిటీలో పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం సాయంత్రం4.30 నుంచి 5.30 గంటల వరకు కట్టరాంపూర్ మెయిన్ రోడ్, తిరుమలనగర్, రెడ్డికాలనీ, శ్రేయం అపార్ట్‌మెంట్, మైనారిటీ స్కూల్, గిద్దె పెరుమాండ్ల ఆలయం, హనుమాన్‌నగర్, తిరుమల్‌నగర్, ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ, శ్రీనివాస్‌నగర్ కాలనీ, గణేశ్‌నగర్ బైపాస్, కమాన్, ఎన్‌టీఆర్ విగ్రహం, గణేశ్‌నగర్, అల్కాపురి, ఐటీఐ కళాశాల, ఐటీహబ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
30న జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల ప్రకారం ఈనెల 30న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్ గౌడ్ తెలి పారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, ప్రోగ్రెస్ కార్డ్, రెండు ఫొటోలతో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.


