విద్యుత్‌ భవన్‌ ఎదుట ఆర్టిజన్ల ధర్నా | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ భవన్‌ ఎదుట ఆర్టిజన్ల ధర్నా

Mar 27 2026 9:22 AM | Updated on Mar 27 2026 9:22 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యుత్‌ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం తెలంగాణ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని విద్యుత్‌ భవన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఒకే సంస్థలో రెండు విధాల సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తూ సుమారు 19 వేల మంది ఆర్ట్జీన్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థ తక్షణమే వివక్షను తొలగించాలని విజ్ఞప్తి చేసారు. పీస్‌రేట్‌ కార్మికులకు 11 జిఓ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సంస్థలో విలీనం చేయాలని ఆర్టిజన్‌ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 8వ తేదీ వరకు సమస్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement