బల్దియా లైన్‌మెన్‌కు విద్యుత్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

బల్దియా లైన్‌మెన్‌కు విద్యుత్‌ షాక్‌

Mar 26 2026 7:32 AM | Updated on Mar 26 2026 7:32 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ ఎలక్ట్రికల్‌ విభాగంలో పనిచేస్తున్న బొమ్మకల్‌కు చెందిన లైన్‌మెన్‌ శివ విద్యుత్‌షాక్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం అలుగునూరులో స్ట్రీట్‌ లైట్‌ బిగిస్తున్న స మయంలో పక్కనే ఉన్న 11 కేవీ లైన్‌ తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మేయర్‌కొలగాని శ్రీనివా స్‌ వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి చేరుకొని, శివ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఎలక్ట్రికల్‌ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సి పల్‌ కార్మికులకు భద్రతా పరికరాలు అందించాలని మాజీ మేయర్‌, 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌షాక్‌తో గాయపడిన శివను ఆసుపత్రిలో పరామర్శించారు.

రూ.3.46 లక్షలు కాజేసిన సైబర్‌ నేరస్తులు

వీర్నపల్లి(సిరిసిల్ల): ఆన్‌లైన్‌ మోసగాళ్ల ఉచ్చులో ప డి ఓ రైతు భారీగా నగదు కోల్పోయిన ఘటన వీర్నపల్లి మండలంలో అడవిపదిరలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అడవిపదిరకు చెందిన పొలగాని లచ్చయ్యకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. తాము ధని బ్యాంక్‌ ప్రతినిధులమని నమ్మించారు. భారీ మొత్తంలో లోన్‌ ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్‌ ఫీజుల పేరుతో పలు విడతల్లో రూ.3,46,799 కాజేశారు. నగదు పంపిన తర్వాత సదరు వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లచ్చయ్య పోలీసులను బుధవారం ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement