కరీంనగర్‌క్రైం: జిల్లాలో నమోదవుతున్న పోక్సో కేసులు, మహిళలకు సంబంధించిన నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2024వరకు పెండింగ్‌లో ఉన్న కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాలపై సమీక్షించారు. ఆస్తి సంబంధిత, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందన్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అనవసరంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటే ప్రమాదకరమని హెచ్చరించారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వేణుగోపాల్, శ్రీనివాస్‌జి, విజయ్‌కుమార్, వెంకటస్వామి, మాధవి, యాదగిరిస్వామి, సతీశ్ పాల్గొన్నారు.
డిజిటలైజేషన్‌లో యువత పాత్ర కీలకం
కరీంనగర్ సిటీ: డిజిటలైజేషన్‌లో యువత ముందుండి వికసిత భారత్ నిర్మాణానికి పునా దులు వేయాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేష్‌కుమార్ సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ రోల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్ ది జర్నీ ఆఫ్ 2047‘ అనే అంశంపై రిజి స్ట్రార్ సతీశ్‌కుమార్ అధ్యక్షతన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో డిజిటల్ చెల్లింపులతో బ్యాంకింగ్ సేవల్లో ఆధునిక మార్పులొచ్చాయన్నారు. విద్యారంగంలోనూ 2047వరకు ఈ మార్పులు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆల్ ఇండియా కామ ర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జాస్తి రవికుమార్ మాట్లాడుతూ డిజిటలైజేషన్‌తో వాణిజ్య, ఉత్పత్తి రంగాల్లో 2020 నుంచి 2030 వరకు అభివృద్ధికరమైన వసతులు వస్తున్నా యన్నారు. సదస్సు డైరెక్టర్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ హరికాంత్ మాట్లాడుతూ ఈ సెమినార్‌లో 130 పరిశోధన పత్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు.
నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జిల్లాకోర్టులో జరగనున్నట్లు ఎన్నికల అధికారి మారోజు రామకృష్ణాచారి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. మొత్తం 1,080 మంది న్యాయవా దులు ఓటుహక్కు కలిగి ఉన్నారని వివరించా రు. ఫలితాలు రాత్రి వరకు వెల్లడించనున్నట్లు తెలిపారు. కోర్టు ఆవరణలో అభ్యర్థులు మాత్ర మే ప్రచారం చేసుకోవాలని తెలిపారు. ప్రెసిడెంట్ స్థానానికి ముగ్గురు, వైస్ ప్రెసిడెంట్ జనరల్ స్థానానికి నలుగురు, మహిళా స్థానానికి ఇద్దరు, జనరల్ సెక్రటరీ స్థానానికి నలుగురు, జాయింట్ సెక్రటరీ జనరల్ స్థానానికి ఇద్దరు, ట్రెజరర్‌కు ఐదుగురు, లైబ్రరీ సెక్రెటరీకి ముగ్గు రు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ఇద్దరు, సీనియర్ ఈసీ మెంబర్‌కు నలుగురు, సీనియర్ ఈసీ మహిళకు ఇద్దరు, జూనియర్ ఈసీ జనరల్‌లో ఎనిమిది మంది, జూనియర్ ఈసీ మహిళాస్థానంలో ఐదుగురు పోటీ పడుతున్నారు. జాయింట్ సెక్రటరీ మహిళాస్థానానికి ఎం.అనురాధ ఏకగ్రీవమయ్యారు.
29 లోగా లెక్కలు చెప్పాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఇటీవల జరిగిన నగర పాలకసంస్థ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ఈ నెల 29వ తేదీ లోగా సమర్పించాలని నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్‌దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం 45 రోజుల్లో తమ వ్యయ లెక్కలను విధిగా సమర్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీలోగా సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులకు లెక్కలు అందజేయాలన్నారు. నగరంలోని 1వ డివిజన్ నుంచి 14వ డివిజన్ వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎ.కిరణ్‌కుమార్, 15 నుంచి 28 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.వి.శివనాగేందర్‌రెడ్డి, 29 నుంచి 42 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎ.అశోక్‌కుమార్, 43 నుంచి 54 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.స్వర్ణలత, 55 నుంచి 66 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.జమునారాణిలు ఎన్నికల వ్యయ సహాయ పరిశీలకులుగా ఉన్నారన్నారు. గడువులోగా ఆయా డివిజన్లకు చెందిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ లెక్కలు అప్పగించాలని సూచించారు.


