పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పుకార్లను పట్టించుకోవద్దని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి గట్టు నర్సింగరావు స్పష్టం చేశారు. జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సరఫరాలో జాప్యం వల్లే తప్పా ఇంధనం సమృద్ధిగా ఉందని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగదారుల ఇబ్బందుల క్రమంలో బుధవారం డీఎస్‌వో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయా సమస్యలపై పరిస్థితులను వివరించారు. ఎవరైనా ఇంధన కృత్రిమ కొరత సృష్టిస్తే 9154249727 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. –కరీంనగర్ అర్బన్


