కరీంనగర్‌స్పోర్ట్స్: సీఎంకప్–2025 పోటీల్లో జిల్లా జట్టు రాష్ట్రంలో మూడోస్థానాన్ని కై వసం చేసుకోగా.. 44 విభాగాల్లో 55 మెడల్స్ సాధించిన క్రీడాకారులను కలెక్టర్ చిత్రామిశ్రా అభినందించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, కోచ్‌లు, ఒలింపిక్, క్రీడాసంఘాల బాధ్యులు బుధవారం కలెక్టర్‌ను కలిశారు. డీవైఎస్‌వో శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కోచ్‌లు ఉన్నారు.


