కరీంనగర్‌టౌన్: పెన్షనర్లకు ఆర్థిక నష్టం కల్గించేలా ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదించిన పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదురుగా జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఉస్మాన్‌పాషా, మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్న చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. పెన్షనర్ల సంఘం బాధ్యులు జీవీ.మనోహర్‌కుమార్‌గౌడ్, రామచంద్రం, నాగమోహన్, శంకరస్వామి, రాజిరెడ్డి ఉన్నారు.


