‘ఆపరేషన్‌ యాత్రి సురక్షా’లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ యాత్రి సురక్షా’లో ప్రతిభ

Mar 25 2026 7:16 AM | Updated on Mar 25 2026 7:16 AM

రామగుండం: సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగంలో నిర్వహించే ‘ఆపరేషన్‌ యాత్రి సురక్షా’లో భాగంగా పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆకస్మిక సోదాలు నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించి, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రామగుండం రైల్వే భద్రత దళానికి చెందిన ఏఎస్‌ఐ మాసాని నాగరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రదీప్‌కుమార్‌ నిర్వహించిన ఆపరేషన్‌ యాత్రి సురక్షాలో ఓ దొంగను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఈక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య నడిచే రైళ్లలో ప్రయాణికుల మొబైల్‌ ఫోన్లు 8 దొంగిలించినటు్‌ల్‌ ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.61వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ఏఎస్‌ఐ నాగరాజు, హెచ్‌సీ ప్రదీప్‌కుమార్‌ను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సికింద్రాబాద్‌ డివిజనల్‌ ఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌వర్మ ప్రకటించారు. ఈవిషయాన్ని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులను డివిజనల్‌ కమిషనర్‌ ఆలకుంట నవీన్‌కుమార్‌, రామగుండం ఆర్‌పీఎఫ్‌ ఎస్సై క్రాంతి తదితరులు అభినందించారు.

ఈనెలలో రూ.61వేల విలువైన వస్తువుల రికవరీ

ఉత్తమ సిబ్బందిగా గుర్తించిన రైల్వే అసిస్టెంట్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement