విద్యుత్‌ షాక్‌తో మేకల కాపరి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో మేకల కాపరి మృతి

Mar 25 2026 7:16 AM | Updated on Mar 25 2026 7:16 AM

సైదాపూర్‌: విద్యుత్‌ షాక్‌తో మేకల కాపరి, రెండు మేకలు మృతి చెందిన ఘటన సైదాపూర్‌ మండలం సర్వాయిపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారంగా సర్వాయిపేటకు చెందిన బొల్లి సమ్మయ్య(49) ఆకునూర్‌ శివారులో మేకలు మేపుతున్నాడు. హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌కు చెందిన ఓ రైతు కోతుల బెడద తప్పించుకునేందుకు వరి చేను చుట్టూ కరెంట్‌ షాక్‌ పెట్టాడు. మేకలు మేపుతూ అటువైపుగా వెళ్లిన బొల్లి సమ్మయ్యకు రెండు మేకలకు కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ పులి వెంకట్‌, సైదాపూర్‌ ఎస్సై స్వాతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతునికి భార్య సరవ్వ, కుమారుడు ఉన్నారు.

సీఎంకప్‌లో తృతీయ స్థానం

కరీంనగర్‌: సీఎం కప్‌–2025లో రాష్ట్రస్థాయిలో కరీంనగర్‌ జిల్లా తృతీయస్థానం సాధించింది. హైదరా బాద్‌ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు వేడుకల్లో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి, షట్లర్‌ సైనా నెహ్వల్‌ చేతుల మీదుగా డీవైఎస్‌వో శ్రీనివాస్‌ ట్రోఫీ అందుకున్నారు. ఆదిలాబాద్‌ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో నిలవగా కరీంనగర్‌ 79.4పాయింట్లతో తృతీయ స్థానం సాధించింది. కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్‌, గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఎస్సైపై వేటు?

మెట్‌పల్లి: పేకాట ఆడుతూ పట్టుబడిన మెట్‌పల్లి ఏఎస్సై సత్యనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. పట్టణంలోని రాంనగర్‌లో శనివారం రాత్రి ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి దాడి చేశారు. అందులో పట్టుబడిన పలువురిలో ఏఎస్సై సత్యనారాయణ ఉన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ చేసే సత్యనారాయణ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement