కరీంనగర్‌క్రైం: మహిళా పోలీసుల్లో నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌లోని అస్త్ర కన్వెన్షన్‌లో ‘షీలీడ్స్–2026’ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ సమాజ రక్షణలో మహిళా పోలీ సులు కీలకమన్నారు. బాధితులు, నిందితులు, ఆందోళనకారుల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై హుజూరాబాద్ ఏసీపీ వి.మాధవి అవగాహన కల్పించారు. అనంతరం ఉచి త వైద్య శిబిరం నిర్వహించారు. అదనపు డీసీ పీ వెంకటరమణ, సీటీసీ ఏసీపీ వేణుగోపాల్, ఆర్‌ఐలు రజినీకాంత్, కిరణ్ పాల్గొన్నారు.
కరీంనగర్‌సిటీ: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ప్రముఖ సంస్థలైన క్వెస్ కార్ప్, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఆదర్శ నెక్సా ఆటోమొబైల్స్, వరుణ్ మోటార్స్, ధ్రువంత్ సొల్యూషన్స్, డీ మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, హెటిరో ఫార్మా, ఫ్యూజన్ ఫినాన్స్, రాన్‌స్టాండ్ పాల్గొన్నాయి. 400 మందికి పైగా హాజరుకాగా 230మంది షార్ట్‌లిస్ట్ అ య్యారు. వారిని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ డి.శ్రీనివా స్, ఎఫ్‌టీఎం రాజశేఖర్ అభినందించారు.
28న జాతీయ లోక్ అదాలత్
కరీంనగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే.రాణి తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ కేసులు , మోటారు ప్రమాద, చెక్‌బౌన్స్, ఫ్యామిలీ, ఇన్సూరెన్స్, బ్యాంకు కేసులు ఇరు పార్టీల రాజీ ద్వారా పరిష్కరించునున్నట్లు తెలిపారు. కేసులు పరిష్కరించుకోవాలనుకునే వారు న్యాయ సేవాధికార సంస్థ, పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.


