ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాగట్లపల్లి శివారులో సోమవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన దంపతులు సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట వైపునకు బైక్‌పై వస్తున్నారు. మండలంలోని అక్కపల్లికి చెందిన చిట్టిబాబు తన బైక్‌పై సిరిసిల్లకు వెళ్తున్నాడు. ఈక్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దంపతులతోపాటు చిట్టిబాబు గాయపడ్డారు. చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఒకరు మృతి చెందారు. వరుస ప్రమాదాలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
డివైడర్‌ను ఢీకొన్న ఆటో
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద సోమవారం వేకువజామున కప్ సాసర్ డివైడర్‌ను ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్ బొమ్మనవేణి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన బొమ్మనవేణి రాజు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. నిత్యం ఉదయం కరీంనగర్ డెయిరీకి సంబంధించిన పదిర, పోతిరెడ్డిపల్లి, హరిదాస్‌నగర్ పాల కేంద్రాల నుంచి పాలు సేకరించి ఎల్లారెడ్డిపేటలోని డెయిరీలో డెలివరీ చేస్తుంటాడు. రోజు మాదిరిగానే పదిర నుంచి పాలు తీసుకొస్తుండగా మండల కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద గల కప్పుసాసర్ డివైడర్‌ను ఢీకొని ఆటో ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉన్న రాజును స్థానిక బీజేపీ నాయకులు గమనించి మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం రాజు కోమాలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


