హుజూరాబాద్: పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో సోమవారం రామకోటి యజ్ఞం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం చేపట్టిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా, రామనామ స్మరణతో హాల్ మారుమోగింది. ఈ యజ్ఞంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శ్వేత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు 650 మంది మహిళలను ఏకం చేసి, ఈ ఆధ్యాత్మిక క్రతువు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గందె శ్రీనివాస్, సుద్దాల హరిశంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, బల్లు పున్నం, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య నాయకులు నార్ల రాజేందర్, ఎస్‌ఆర్పీ శివనాథుని వేణుగోపాల్, కటుకం మారుతి, శివనాథుని శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యూనిఫామ్ కుట్టుపై శిక్షణ
జూలపల్లి: మహిళలను అర్థికంగా బలోపేతం చేసేందుకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపై అవగాహన కల్పించారు. స్థానిక వెలుగు సమాఖ్య కార్యాలయంలో సోమవారం శిక్షణ శిబిరం నిర్వహించగా.. సమాఖ్య అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజరు సుధాకర్ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 13 పంచాయతీల నుంచి 45 మంది మహిళలు శిక్షణకు హాజరయ్యారు. ట్రెయినర్లు మసూద, సీసీలు ఆనంద్, అనిత, అకౌంటెంట్ అనిత తదితరులు పాల్గొన్నారు.
వైల్డ్‌లైఫ్ బయోలజిస్ట్‌కు ప్రశంసాపత్రం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కొత్తపల్లికి చెందిన జోగు ఎల్లం కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో వైల్డ్‌లైఫ్ బయోలజిస్టు(పులులు ఇతర వన్యప్రాణి నిపుణులు)గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉన్న అటవీ అధికారులు వన్యప్రాణులను సాంకేతికంగా గణన చేయడం, టైగర్ మానిటరింగ్‌లో శిక్షణ ఇస్తున్నందుకు ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ప్రశంసాపత్రం అందుకున్నారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర అటవీ సంరక్షణాధికారి సువర్ణ చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్‌లో ప్రశంసాపత్రం అందుకున్నారు.


