కరీంనగర్‌టౌన్: ఒక దేశంపై మరో దేశం దాడులు చేయకుండా జరగాలంటే అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని.. ఇందుకు ఐక్యరాజ్యసమితి, దేశ ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకోవాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో సోమవారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు చేస్తున్న యుద్ధంతో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుందన్నారు. ఈక్రమంలోనే వంటగ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కొరత సృష్టిస్తున్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సంప్రదింపులు చేయాలని కోరారు. పార్లమెంటు సమావేశాల్లో అత్యధిక రోజులు పాల్గొన్నానని గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీ దేశప్రజల ప్రయోజనాల కోసం ఏం చేశౠరో చెప్పాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, కార్పొరేట్ సంస్థలు బాగుపడ్డాయని విమర్శించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏప్రిల్‌లో ఇంటింటికీ సీపీఐ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య, పొనగంటి కేదారి, అందె స్వామి, కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య న్యాలపట్ల రాజు పాల్గొన్నారు.
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి


