వాగేశ్వరి కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

వాగేశ్వరి కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు

Mar 24 2026 7:05 AM | Updated on Mar 24 2026 7:05 AM

తిమ్మాపూర్‌(మానకొండూర్‌): మండలంలోని రామకృష్ణకాలనీలో గల వాగేశ్వరి ఇంజినీరింగ్‌ కళాశాలకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌ గుర్తింపు లభించినట్లు కళాశాల జనరల్‌ సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తెలిపారు. జనవరిలో అధికారుల బృందం కళాశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారని, అధికారుల నివేదిక ఆధారంగా కళాశాలలో బీటెక్‌ సీఎస్సీ, ఈసీఈ, ఈఈఈ కోర్సులకు మూడేళ్ల పరిమితితో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌ గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహకరించిన అధ్యాపకులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. జాయింట్‌ సెక్రెటరీ దావు శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు వినోద్‌, ప్రకాష్రెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మసీ కళాశాలకు అటానమస్‌

మండలంలోని వాగేశ్వరి ఫార్మసీ కళాశాలకు అటానమస్‌ గుర్తింపు వచ్చినట్లు కళాశాల జనరల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణాలోనే మొట్టమొదటిసారిగా వాగేశ్వరీ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ కళాశాలకు జేఎన్టీయూ అటానమస్‌ గుర్తింపు ఇచ్చిందన్నారు. మొదట నాక్‌ ఏ ప్లస్‌ వచ్చిందని, సోమవారం తమ కళాశాలకు అటానమస్‌ హోదా వచ్చిందన్నారు. తమ కళాశాలకు అటానమస్‌ రావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్బీఏ వచ్చేలా తాము, ప్రిన్సిపాల్‌, ఫ్యాకల్టీ కృషి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement