జ్యోతినగర్: రామగుండం నగర ప్రజల సహకారంతో సుందరీకరణ పనులు చేపడతామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డు, ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు, రాజీవ్ రహదారి సర్వీసు రోడ్డులో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, భూలక్ష్మి, స్వప్నప్రియ, ఎన్టీపీసీ ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్‌తో కలిసి సోమవారం పర్యటించారు. స్వామి మాట్లాడు తూ, ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టుకు నిర్మించిన ప్రహరీ ప్రమాదకరంగా ఉందన్నారు. ఓపెన్ డ్రైనేజీలో చెత్త పేరుకుపోయిందని, దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డులో కూల్చివేసిన సులభ్‌కాంప్లెక్స్ శిథిలాలను వెంటనే తొలగించి బస్‌షెల్టర్‌ను ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీకుకురావావాలని అన్నారు. త్వరలోనే ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు సెంటర్‌ను విస్తరించి, సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్, అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సీస్సార్ ప్రత్యేక నిధులు కేటాయించాలి
రామగుండం మేయర్ మహంకాళి స్వామి


