కులం పేరుతో దూషించిన వారిపై కేసు | - | Sakshi
Sakshi News home page

కులం పేరుతో దూషించిన వారిపై కేసు

Mar 24 2026 7:05 AM | Updated on Mar 24 2026 7:05 AM

చందుర్తి(వేములవాడ): సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్‌ పదవి విషయంలో తలెత్తిన వివాదంలో కులం పేరుతో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై జిల్లెల రమేశ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్‌ పదవి విషయంలో అదే గ్రామానికి చెందిన తర్రె శేఖర్‌కు సర్పంచ్‌ నరేశ్‌, ఉపసర్పంచ్‌ ఆకుల ఎల్లయ్య, మరో వ్యక్తి సుంకి వేణులకు శనివారం రాత్రి వివాదం తలెత్తింది. ఈ వివాదంతో తర్రె శేఖర్‌ను సర్పంచ్‌ నరేశ్‌, ఉపసర్పంచ్‌ ఆకుల ఎల్లయ్య, సుంకి వేణు కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు లింగంపేట ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా.. ఈ వివాదాన్ని ప్రోత్సహించిన డప్పుల అశోక్‌పై కేసు నమోదు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాలను పాత ఆలయ కమిటీ పర్యవేక్షణలో చేసుకోవాలని, అల్లర్లు సృష్టించి, గొడవలకు దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

లింగంపేటలో విచారించిన డీఎస్పీ శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement