పన్ను చెల్లించని కోచింగ్‌ సెంటర్‌కు తాళం | - | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లించని కోచింగ్‌ సెంటర్‌కు తాళం

Mar 24 2026 7:04 AM | Updated on Mar 24 2026 7:04 AM

కరీంనగర్‌కార్పొరేషన్‌: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో నగరంలో ఆస్తిపన్ను వసూళ్లను బల్దియా అధికారులు వేగవంతం చేశారు. మొండి బకాయిదారుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం నగరంలోని 51వ డివిజన్‌ పరిధి కోర్టు సమీపంలోని 3–1–777, 3–1–3777/1, 3–1–3778, 3–1–778/1 ఇంటి నంబర్లలో ఉన్న కోచింగ్‌ సెంటర్‌ను డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌ తనిఖీ చేశారు. ఆస్తి పన్ను బకాయి చెల్లించక పోవడంతో సంబంధిత కోచింగ్‌ సెంటర్‌కు తాళం వేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్తి పన్ను బకాయిదారులు సకాలంలో పన్నులు చెల్లించాలన్నారు. పన్ను చెల్లించనివారి షాప్‌లు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఆస్తి పన్ను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఆదర్శంతో కూడుకున్న వృత్తి జర్నలిజం

కరీంనగర్‌సిటీ: జర్నలిజం ఆదర్శంతో కూడుకున్న వృత్తి అని, సామాజిక బాధ్యత ఎంతో ఉంటుందని ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్స్‌ పి.నితిన్‌పాఠక్‌, టి.రాజయ్య అన్నారు. సోమవారం కళాశాలలో 27వ బ్యాచ్‌ జర్నలిజం సర్టిఫికెట్‌ కోర్స్‌ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ ప్రిన్సిపాల్స్‌, తెలుగు విభాగం అధ్యక్షుడు, కోర్స్‌ కో ఆర్డినేటర్‌ డా.బూర్ల చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, జర్నలిజం సర్టిఫికెట్‌ కోర్స్‌ ద్వారా విద్యార్థులకు భాష, రచనా నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. విలేకరి రాసే ప్రతి అక్షరం సమాజాన్ని జాగృతం చేసేలా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఎం.శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు విభాగ అధ్యాపకులు బూర్ల వెంకటేశ్వర్లు, డి.ప్రకాష్‌, ఆర్‌.శ్రీనివాస్‌, మెట్టు వెంకటేశ్వర్లు, పాత అశోక్‌. పి.చైతన్య, టి.భోజన్న, పి.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement