జమ్మికుంట: జమ్మికుంట మండలం గండ్రపల్లిలో తరచూ ఏవరో ఒకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు సోకిందని ఆదివారం వేకువజామున గ్రామస్తులందరూ ఊరును ఖాళీ చేశారు. ఊరి బయటకు వెళ్లి వంట చేసుకున్నారు. గ్రామంలో రెండు నెలలుగా ఒకరి దినకర్మ పూర్తి కాకుండా, మరొకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు సోకడమే ఇందుకు కారణమని గ్రామస్తులు భయాందోళన చెందారు. పండితుల సలహా మేరకు గ్రామ పెద్దల అలోచనలతో ఆదివారం సూర్యోదయనికి ముందుగా ఊరును ఖాళీ చేశారు. మానేరు పరివాహక, పొలాలు, చెరువు కట్టలపైకి వెళ్లి వంటలు చేసుకుని, అక్కడే భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.
సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు ఎంపిక
కరీంనగర్‌స్పోర్ట్స్: ఢిల్లీలో ఈ నెల 21నుంచి జరుగుతున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు శంకరపట్నం మండలం కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజ్‌కుమార్ ఎంపికై నట్లు డీవైఎస్‌వో శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి, జాతీయ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాజ్‌కుమార్ ఎంపికపై ఎస్జీ్‌ఎఫ్ కార్యదర్శి వేణుపాల్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, పెటా అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, పీడీలు, పీఈటీలు సీహెచ్ సంపత్ రావు, కొమురోజు కృష్ణ జిట్టవేణి శ్రీనివాస్, అనూప్‌రెడ్డి, వీర్‌పాల్‌రెడ్డి, సంతోష్, మహేశ్ హర్షం వ్యక్తం చేశారు.


