మాస్టర్‌ చాంపియన్‌ మనోహర్‌రావు | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ చాంపియన్‌ మనోహర్‌రావు

Mar 23 2026 8:51 AM | Updated on Mar 23 2026 8:51 AM

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తూముల మనోహర్‌రావు థాయ్‌లాండ్‌ దేశంలో జరిగిన ఏసియన్‌ రీజియన్‌ మీట్‌లో పాల్గొని హ్యామర్‌త్రో మాస్టర్‌ చాంపియన్స్‌ పోటీల్లో పతకం దక్కించుకున్నారు. ఇటీవల ఆ దేశంలో జరిగిన పోటీల్లో మూడోస్థానంలో నిలిచిన మనోహర్‌రావును ఆదివారం జిల్లాలోని క్రీడాసంఘాల నాయకులు, రిటైర్డ్‌ పీడీ, పీఈటీలు తదితరులు ఘనంగా సత్కరించారు. 70ఏళ్లకుపైబడి వయసు ఉన్న మనోహర్‌రావు ఇప్పటికీ అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలను సాధించి పెద్దపల్లి పేరును ఖండంతరాలు దాటించారని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య ప్రశంసించారు. భావిక్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని క్రీడా సంఘాల నాయకులు లక్ష్మీరాజం, తోట శంకర్‌, దేవసాని ధర్మయ్య అన్నారు. మనోహర్‌రావును సత్కరించుకోవడం సంతోషకరమన్నారు.

ఇంజినీరింగ్‌ సీటు కోసమని..

ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ సీటు సాధించాలంటే క్రీడల్లో ప్రావీణ్యం ఉండాలని, దీంతోనే సీటు సాధించే అవకాశం ఉంటుందని తెలియడంతో ఆటల వైపు దృష్టి సారించానని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ చైర్మన్‌, హ్యామర్‌త్రో పతక గ్రహీత తూముల మనోహర్‌రావు అన్నారు. అప్పట్నుంచి క్రీడలంటే ఇష్టంగా మారి ఇప్పుడు అనేక దేశాల్లో జరిగే పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో షపీ, కలీం, మాతంగి శ్రీఽనివాస్‌, శ్రీధర్‌, తూముల శ్రీనివాస్‌, సుబ్రమణ్యం, శ్రీధర్‌, రాజేశం, అక్కపాక నరేశ్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

థాయ్‌లాండ్‌ పోటీల్లో ప్రతిభ

ఖండాంతరాలు దాటించిన పెద్దపల్లి ఖ్యాతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement