గోదావరిఖని: నిండు గోదావరి నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో ఎండి పోయిందని పేర్కొంటూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి పిండప్రదానంన చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలోని ఇసుక తెన్నెలపై తొలుత క్రికెట్, అష్టాచెమ్మా ఆడి నిరసన తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం నిండు గోదావరి ప్రస్తుతం ఎండు గోదారిలా మారిందని పేర్కొన్నారు. గతేడాది గోదావరి నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎర్రవెల్లి వరకు పాదయాత్ర నిర్వహించిన విషయం విదితమే. కాగా, వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు సరిచేసి నీటిని నిల్వచేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాగంగా నిండి కుండాల ఉండే గోదావరిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడారిగా మార్చిందిని ఆరోపించారు. ఇన్నిరోజులు గడిచినా ఎందుకు రిపేర్లు చేయడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి,ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నారు.
బీఆర్‌ఎస్ నేతల వినూత్న కార్యక్రమం
సీఎంకు పిండప్రదానం చేసిన నాయకులు


