● కాపరికి తీవ్రగాయాలు.. 6 గొర్రెల మృత్యువాత
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం గొర్రెలమందపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కాపరికి తీవ్రగాయాలు కాగా ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారుకు గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. గొర్రెలను తప్పించే క్రమంలో అదుపుతప్పి వాటిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పట్టణంలో శాసీ్త్రనగర్‌కు చెందిన కాపరి మేకల రాజుకు తీవ్రగాయాలు కాగా ఆరు గొర్రెలు మృతి చెందాయి. మరోనాలుగు తీవ్రంగా గాయపడ్డాయి. కారు సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కాపరి రాజును వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.


