గాల్లో చెక్కర్లు కొడుతూ దూసుకుపోతోంది డ్రోన్. ఒకప్పుడు పెళ్లి వేడుకలనే చిత్రీకరించిన డ్రోన్.. ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ దూసుకెళ్తోంది. ఎరువులు, పురుగుమందులను పంటలపై పిచికారీ చేయడంలో తాను సైతం అంటోంది. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా తక్కువ నీటితో, ఖర్చు ఆదా చేస్తూ పురుగుమందులు, ఇతర మందులు పిచికారీ చేస్తోంది. పెద్దపల్లి శివారు నిట్టూరులోని వరి పొలాల్లో డ్రోన్‌తో పిచికారీ చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు కొందరు రైతులు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


