కరీంనగర్‌టౌన్: కరీంనగర్ మంకమ్మతోటలోని పొన్నం ప్రభాకర్ ఇంటిని ఆశా కార్యకర్తలు శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. మంత్రి కార్యాలయం ముట్టడి విజయవంతమైందని, ప్రభుత్వం ఇకనైనా మేల్కొని సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఆశా వర్కర్స్‌కు అన్యాయం చేసిందని విమర్శించారు. సీఐటీయూ నాయకులు ఎడ్ల రమేశ్, పున్నం రవి, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, జిల్లా అధ్యక్షురాలు కాల్వ సారిక, జిల్లా ఉపాధ్యక్షురాలు నాగెల్లి పద్మ, సుమలత, ప్రియాంక, సత్యలక్మి, శ్యామల, లత పాల్గొన్నారు.


