కరీంనగర్ కల్చరల్: శుక్రవారం నెలవంక దర్శనం ఇచ్చింది. శనివారం రంజాన్ పండగు జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధం అయ్యారు. నెలరోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన వారు నెలవంక దర్శనంతో పండుగ జరుపుకోనున్నారు. రంజాన్ ప్రార్థనలకు నగరంలోని పలు ఈద్గా మైదానాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. సామియాలు, టెంట్లు వేశారు. సాలెహ్‌నగర్ ఈద్గా వద్ద శనివారం ఉదయం 9:30 నిమిషాలకు ఈద్ ఉల్ ఫితర్ నమాజు ఆచరించనున్నారు. వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద గల పురానీ(ఖదీమ్‌షాహి)ఈద్గా, చింతకుంట ఈద్గా, బైపాస్ రోడ్డులోని ఈద్గాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు.


