ఉత్సాహంగా ‘చేటీ చంద్‌’ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘చేటీ చంద్‌’

Mar 21 2026 5:00 AM | Updated on Mar 21 2026 5:00 AM

ఉత్సాహంగా ‘చేటీ చంద్‌’

కరీంనగర్‌: సింధీ సమాజం ప్రాచీనమైన చరిత్ర కలిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన సింధీల నూతన సంవత్సర వేడుకలు, ‘చేటీ చంద్‌’ ర్యాలీలో పాల్గొన్నారు. వైశ్య భవన్‌ సమీపంలో జరిగిన కార్యక్రమంలో సింధీ యువత, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేయగా, బండి సంజయ్‌ పాల్గొన్నారు. తెలుగు వారికి ఉగాది ఎంత ముఖ్యమో, సింధీ సమాజానికి ఘూలేలాల్‌ జయంతి అంతటి ప్రాధాన్యత కలిగిందన్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో సింధీలు ముందంజలో ఉండి దేశ ప్రతిష్టను పెంచుతున్నారని సంజయ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement