గంగాధర: ఎంతటి ట్రాఫిక్ ఉన్నా, సిగ్నల్ పడినా ఆగకుండా రోగులను తరలించే అంబులెన్స్‌లు ఇక్కడ ఆగక తప్పదు. బాధితులు ఎంత సీరియస్‌గా ఉన్నా ముందుకెళ్లే అవకాశం ఉండదు. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా సమీపంలోని రైల్వే గేటు పడితే చాలు ఏ వాహనమైనా ఇరువై నిమిషాల పాటు ఆగాల్సిందే. శుక్రవారం జగిత్యాల వైపు నుంచి కరీంనగర్‌కు పేషెంట్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్ రైల్వేగేట్ పడటంతో ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ అమలుకు నోచుకోవడం లేదు.


