కోరుట్లరూరల్: కోరుట్ల మండలం మాదాపూర్‌లో మూడురోజుల క్రితం హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి ఘటనలో నిందితులైన హరిబాబు తల్లి చిత్తరి లక్ష్మి, సోదరులు చిత్తరి ఆనంద్, చిత్తరి అశోక్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారిరని రిమాండ్‌కు తరలించినట్టు మెట్‌పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. డీఎస్పీ వివరాల ప్రకారం.. వైష్ణవిని భర్త హరిబాబు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు మూడురోజుల క్రితం హత్యకు పాల్ప డ్డాడు. ఆయనకు తల్లి, సోదరులు సహకరించారనే ఆరోపణలపై ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఎస్సై చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుడిని ఉరితీయాలి..
వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త చిత్తరి హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి బంధువులు గురువారం కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద ధర్నా కు దిగారు. ఫ్లకార్డులతో మాదాపూర్ నుంచి తరలివచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు న్యా యం చేయాలని నినాదాలు చేశారు. దీంతో జాతీ య రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి ధర్నా ప్రదేశానికి చేరుకుని నిందితులపై కేసులు నమోదు చేశామని, కోర్టులో ఉన్నందున ఓపిక పట్టాలని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
ధర్నా చేస్తున్న వైష్ణవి బంధువులు
రిమాండ్ చూపుతున్న డీఎస్పీ రాములు


