కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Mar 20 2026 7:57 AM | Updated on Mar 20 2026 7:57 AM

శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026 ● భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ● ఉగాది పచ్చడి వితరణ – 8లోu

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
పరాభవ వైభవం

7

ఎస్సీ యువత ఉపాధికి భరోసా

షెడ్యూల్డ్‌ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం 2025–26వ ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం ఉపాధి పథకాల యూనిట్లు మంజూరు చేసింది.

బాసర ట్రిపుల్‌ ఐటీకి దరఖాస్తులు

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల బీటెక్‌ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

కరీంనగర్‌కల్చరల్‌: జిల్లాలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మిన్నంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పండితులతో పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ పురస్కరించుకుని కొత్తకుండలో షడ్రచుల మేళవింపు(ఉప్పు, కారం, వగరు, చేదు, పులుపు, తీపి)తో తయారు చేసిన ఉగాది పచ్చడిని సేవించారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో అభిషేకం, ఉగాది పచ్చడి వితరణ, పంచాంగ పఠనం జరిగింది. హంపీ పిఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ పంచాంగ శ్రవణం వినిపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు పాల్గొని ఉగాది పచ్చడి స్వీకరించారు. పొన్నం కాంప్లెక్స్‌లో జరిగిన పంచాంగ శ్రవణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ సత్తుమల్లేశం, కాంగ్రెస్‌ నాయకులు అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాంగ శ్రవణం వింటున్న భక్తులు

మార్కెట్‌ రోడ్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో..

విద్యారణ్య భారతిస్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న కేంద్ర మంత్రి సంజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement